ఆర్టీసీ.. రక్షతి రక్షిత : పువ్వాడ

అక్షిత/ఖమ్మం బ్యూరో : దేశంలో ఆర్థిక సరళీకృత విధానాలు అమ ల్లోకి వచ్చిన 1990 దశకం అనంతర దశలో ప్రభుత్వరంగ సంస్థలకు ప్రైవేట్ రంగం నుంచి పోటీ పోటెత్తింది. ప్రభు త్వ ఆధ్వర్యంలో నడిచిన విద్యారంగం, వైద్యరంగం, బ్యాంకింగ్ వ్యవస్థ, టెలి కమ్యూనికేషన్ల రంగం, తదితర ఎన్నో వ్యవస్థలు ప్రభావితమైనయి. ఎన్నడూ పోటీ అన్న ది తెలువని వ్యవస్థలకు పోటీ అనివార్యమైంది. నాటి ప్రభుత్వ సామ్యవాద పౌరుడు కాస్తా రానురాను ప్రైవేట్ వినియోగదారుడిగా మారిపోయిండు. పైసల విప్లవం ద్వారా కొనుగోలుశక్తిని పెంచుకున్న వినియోగదారుడు ప్రభుత్వ నాణ్యత సరిపోక, కొత్తదనానికి అలువాటు పడి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు, చాయిస్ ఆఫ్ సెలక్షన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. అట్లా సామూహిక ప్రయోజనం కన్నా వ్యక్తిగత ప్రయోజనమే పరమార్థమైన నేపథ్యం. తద్వారా తనకు నాణ్యమైన సేవలను ఎవరందిస్తరో వారి ని మాత్రమే ఆదరిస్తున్నడు. అట్లా డిమాండ్ సప్లయి మీద ప్రభావం చోటుచేసుకున్నది. ఉత్పత్తి సేవారంగాల్లో అడుగుపెట్టిన ప్రతి ప్రైవేట్‌రంగ సంస్థ తక్కువ ధరలతో వినియోగదారుని సౌకర్యమే పరమావధిగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నది. ఇటువంటి పోటీ పరిస్థితుల్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్.. అంటే సామర్థ్యం ఉన్నవారు మాత్రమే మనుగడ కొనసాగించగలుగుతరు. ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఇతర ప్రభుత్వరంగాల ఉద్యోగుల మీద కూడా సర్వైవల్ ఆఫ్ ది పిట్టెస్టు అనే ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. ఇటువంటి ప్రైవేటీకరణ క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం కోసం కృషిచేస్తున్నది. ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించిన ప్రజా నాయకుడిగా నూతన తెలంగాణ రాష్ట్రం సంక్షేమరాజ్య లక్షణాలను కోల్పోకుండా పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తన నిబద్ధతను చాటుకుంటున్నరు సీఎం కేసీఆర్.  గతేడాది ఇదే సమయంలో ఇదే పద్ధతిలో ఇచ్చిన సమ్మె పిలుపు సందర్భంగా స్పందించిన ప్రభుత్వం, 2018, జూన్ నెలలో 16 శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది. సంస్థ బలోపేతానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ కార్పొరేషన్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి పౌరులదాకా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని ఆగం చేద్దామా, అలజడులు సృష్టించి అనిశ్చితి పాలు చేద్దామా అని ఆలోచిస్తే, ఆ నష్టం ఎవరికి అనేది కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు చేతులు కాలినంక ఆకులు పట్టుకోవడం వల్ల ఫలితం లేదు. ధర్మాన్ని రక్షిస్తేనే అది మనలను రక్షిస్తది.

రాష్ర్టాభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను భాగస్వాములను చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ కన్సల్టెన్సీలతో ప్రైవేట్ సంస్థలకే పెద్ద పనులను అప్పచెప్పుతున్న కాలం ఇది. కానీ తెలంగాణ ప్రభుత్వం అట్లా చేయలేదు. బీహెచ్‌ఈఎల్, జెన్‌కో, ఎల్‌ఐసీ వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలకు లాభం చేకూర్చేవిధంగా అనేక కోట్ల రూపాయల పనులను అప్పగించింది. భారతదేశమే ఆశ్చర్యపోయే విధం గా విద్యను ప్రభుత్వ బాధ్యతగా తీర్చిదిద్దుతూ కేజీ టు పీజీ విద్యలో భాగంగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేస్తున్నది. పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభు త్వం అమలుపరుస్తున్న కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కీర్తించబడుతున్నయి. ఇట్లా సీఎం కేసీఆర్ దార్శనికతతో ఒక్కోరంగాన్ని ప్రైవే ట్‌పరం కాకుండా తనవంతు బాధ్యతగా అండగా నిలబడుతున్నరు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థకు మారుపేరుగా మారిన ఆర్టీసీని బలోపేతం చేయడం సమస్యే కాదు తెలంగాణ ప్రభుత్వానికి. కానీ ఎక్కడుం ది సమస్య? ప్రభుత్వం దగ్గరా లేక సమ్మె చేయడం తమ హక్కు అని ముందు వెనుకా చూడకుండా ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్విన ఆర్టీసీ సంఘాలదా? పైన చెప్పుకున్న ఉపోద్ఘాతం నేపథ్యంలో ఆర్టీసీని బలోపేతం చేయడానికి యూనియన్ నేతలు ఆలోచించాల్సిన అంశాలేమిటి? ఆచరించాల్సిన పద్ధ తులేమిటి? సహకరిస్తున్న ప్రభుత్వంతో అనుసరించవలసిన విధానాలేమిటి? అనేది ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల ముందున్న చర్చ. ఈ నేపథ్యంలో సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ యూనియన్‌లు చేస్తున్న డిమాండ్లు ఏమిటి? వాటిని ప్రభుత్వం ఎట్లా ఇప్పటికే అమల్లో పెట్టిందనే అంశాలను చర్చిద్దాం. వాటిలో మొట్టమొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలె అనేది. ఆదే అత్యంత ప్రధాన డిమాండ్‌గా యూనియన్ చెబుతున్నది. అందుకు సం బంధించి రాతపూర్వక హామీ వంటిది ఇస్తేనే సరే లేకుంటే వినేదే లేదు అంటున్నది. ఇక రెండోది ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి పడిన రూ.2 వేల కోట్లను చెల్లించాలె అనేది. కార్మికుల వేతన సవరణ వెంటనే జరుపాలె, డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలె. కార్మికుల హక్కులను సంరక్షించడంతో పాటు సంస్థను పరిరక్షించాలనే డిమాండ్‌లతో సమ్మెకు దిగారు ఆర్టీసీ యూనియన్ నేతలు. ఈ డిమాండ్ల నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ పరిస్థితిని దాని బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఒక్కసారి పరిశీలిద్దాం. రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు రాష్ట్రంలోని 11 రీజియన్లు 24 డివిజ న్ల పరిధిలో మొత్తం 97 డిపోలున్నయి. అందులో ప్రభుత్వానికి చెందినవి 8,360 బస్సులు కాగా, కిరాయి బస్సులు 2100. మొత్తం 10,460 బస్సులు రాష్ట్రంలో సంచరిస్తుండగా వాటిల్లో 6,620 బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నయి. పట్టణ ప్రాంతాల్లో 3,840 బస్సులు ప్రయాణీకులకు సేవలందిస్తున్నవి. ఇందులో ఏసీ బస్సులు 453. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరిగే రూట్ల సంఖ్య మొత్తం 3,692. రోజుకు దాదాపు 97 లక్షల ప్రయాణికులను వారి గమ్యం చేరుస్తున్నవి ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 49,340 అంటే ఒక్కో బస్సుకు 5.31 మంది చొప్పున ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదే కర్ణాటకలో ఒక బస్సుకు 4.6 మాత్రమే ఉద్యోగులున్నరు. ఆర్టీసీ సంస్థ సంపాదిస్తున్న దానికి, ఖర్చుపెడుతున్న దానికి.. అంటే సాలీనా నష్టం దాదాపు సగటున 928 కోట్ల లోటు ఉంటున్నది. ఇప్పటివరకు ఆర్టీసీకి దాదాపు 3000 కోట్ల అప్పులున్నయి. వీటికి వడ్డీ కింద దాదాపు 250 కోట్లు ఏటా ప్రభుత్వం చెల్లిస్తనే ఉన్నది. ఇదిలా ఉం టే 2013లో ప్రభుత్వం పెంచిన 44 ఫిట్‌మెంట్ శాతానికి చెందిన జీతాల భారం ప్రభుత్వం మీద ఏడాదికి రూ.900 కోట్లు పడుతున్నది. ప్రభుత్వం ఇంతగనం చేస్తుంటే ఉన్న మొత్తం 97 డిపోలకుగాను కేవలం 11 డిపోలు మాత్రమే లాభాల్లో నడుస్తున్నయి. దీన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం యూనియన్ నాయకులకు ఉన్నది. ఆర్టీసీకి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక అక్షరాస్యత అవార్డు వివరాలు పరిశీలిద్దాం. 2014-2019 ఆర్థిక సంవత్సరం వరకు పరిశీలిస్తే దాదాపు రూ.4 వేల కోట్ల ను తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి సహాయం చేసింది. అదే తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి సాయం చేయలేదు. వీళ్లు ఆంధ్రాతో పోల్చుకొని మమ్మల్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తేనే.. అనే విధానాన్ని ముందలికి తేవడం ఎంతవరకు ఫలితాన్నిస్తుందో వారే తెలుసుకోవాలె. ఇది అసలుది వదిలి కొసరుతో కొట్లాట మాదిరి తయారైంది. అదే విధంగా డ్రైవర్లు, కండక్టర్లతో సహా ఇతర ఆర్టీసీ సిబ్బంది వేతనాలు మహారా ష్ట్ర, కేరళ, ఒడిషా తదితర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో చాలా ఎక్కువ. ఇక ఆర్టీసీ ఉన్నతాధికారుల జీతభత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయనే విమర్శనూ తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం గమనించాల్సిన అంశమేమంటే.. ఉద్యోగుల సంఖ్య విషయంలోనూ వారికి చెల్లించే జీతాల విషయలోనూ ఆర్టీసీకి ఆర్థికంగా సహకరించే విషయం లోనూ ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ చాలా గొప్పది. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థలు ఇప్పటికే రాను రాను కనుమరుగయితున్నయి. ఉన్నవాటికి ప్రభుత్వ ప్రాధాన్యం తగ్గిపోతున్నది. పలు ఉత్తరాది రాష్ర్టాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నయి. వాటితో పాటు దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు కర్ణాటక వంటి రాష్ర్టాల్లో ఆర్టీసీ సంస్థ అనేక సంస్కరణలకు గురైంది. అక్కడ యూనియన్లు లేవు, వున్నా నామ మాత్రమే. అక్కడ ఒక్కటే ఆర్టీసీ లేదు. పది పదకొండు సంస్థలుగా ఆర్టీసీని విభజించి వికేంద్రీకరణ జరిపిండ్రు. వాళ్ల జీతాలు తెలంగాణలో ఉన్నంతగా లేవు. అతితక్కువ జీతాలతోనే ఇతర రాష్ర్టాల ఉద్యోగులు పనిచేస్తున్నరు. వాటి తో పాటు అనేకవిధాలుగా ప్రభుత్వం అందించే సౌకర్యాలు తెలంగాణలో అమలవుతున్నంతగా పక్క రాష్ర్టాల్లో లేవు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కానీ సంస్థ పట్ల కానీ ఎటువంటి నిర్లక్ష్యం చూపట్లేదు. మరి ఈ నేపథ్యంలో ఉద్యోగులను కన్నబిడ్డలుగా చూసుకోవాల్సిన యూనియన్ నాయకత్వాల బాధ్యత ఏపాటిదో ప్రజలు అర్థం చేసుకుంటున్నరు. పందిరి మీద గుండు పడ్డట్టు ప్రభుత్వంలో విలీనం వంటి డిమాండ్‌ను ముందుపెట్టి, తెగేదాకా గుంజుదామనే ఆర్టీసీ యూనియన్ల వైఖరి బాధ్యతారాహిత్యమని ప్రజ లు, ప్రయాణికులు, బుద్ధిజీవులు సమ్మె డిమాండ్లను పరిశీలించిన వారు విమర్శిస్తున్నరు. గతేడాది ఇదే సమయంలో ఇదే పద్ధతిలో ఇచ్చిన సమ్మె పిలుపు సందర్భం గా స్పందించిన ప్రభుత్వం, 2018, జూన్ నెలలో  16 శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది. సంస్థ బలోపేతానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ కార్పొరేషన్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి పౌరులదాకా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని ఆగం చేద్దామా, అలజడులు సృష్టించి అనిశ్చితి పాలు చేద్దామా అని ఆలోచిస్తే, ఆ నష్టం ఎవరికి అనేది కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు చేతులు కాలినంక ఆకు లు పట్టుకోవడం వల్ల ఫలితం లేదు. ధర్మాన్ని రక్షిస్తేనే అది మనలను రక్షిస్తది. అట్లనే ఆర్టీసీని మీరు రక్షిస్తేనే అది మనలను మన కుటుంబాలను రక్షిస్తదని అమాయక కార్మికులు అర్థం చేసుకోవాలె. .

 

(వ్యాసకర్త: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్)

 

 

tags : puvvada, rtc strike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *