ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు…

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ వయసు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమైన ముఖ్యమంత్రి వారికి పదవీ విరమణ వయసు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

 

 

tags   : Retirement age, Out reach, rtc employes, telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *