ఉచిత విద్య సేవలతో… ఆరోగ్య భద్రత

ఉచిత వైద్య శిబిరాలతో మనోధైర్యం : డాక్టర్ మునీర్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఉచిత వైద్య శిబిరాలతో మనోధైర్యం పెంపొందుతుందని హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సహకారంతో నల్లగొండ జిల్లా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మునీర్ మాట్లాడారు. ప్రతినెల ఒకటో తేదీన నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన వారికి ఉచిత రక్తపరీక్షలు, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు వ్యాయామం చేయాలని, వైద్యుల సలహాల మేరకు ఆరోగ్య నియమాలను పాటించాలని డాక్టర్ మునీర్ కోరారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు డాక్టర్ బాలాజీ, దంత వైద్య నిపుణులు డాక్టర్ నాగు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొగుల సందీప్, యాదగిరి, రమేష్, లక్ష్మణ్, కోట శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ రెడ్డి, ఆఫ్రిది, సాయి రోహిత్, శిరీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *