ఆరోగ్య తెలంగాణ సాకారం

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయక త్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారమవుతున్నది. ప్రభుత్వం కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానల్లో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విస్తృత సేవలతో పేదలకు సర్కారు వైద్యం మరింత చేరువైంది. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పురోభివృద్ధిలో పయనిస్తున్నది. కంటివెలుగు కార్యక్రమంలో ప్రతి ఇంట వెలుగులు నింపి, ఆరోగ్యశ్రీతో నిరుపేదలకు అండగా నిలిచి, కేసీఆర్ కిట్లతో మహిళల్లో భరోసా నింపుతూ.. వైద్య, ఆరోగ్యసేవల్లో వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్నది. రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాలు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుతో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ.. జాతీయ ఆరోగ్యమిషన్ సూచనల మేరకు అన్ని దవాఖానల్లో ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌరులందరి ఆరోగ్య సమాచారాన్ని పొందుపరిచి తక్షణ వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంలో హెల్త్ ప్రొఫైల్ అమలుచేయాలని నిర్ణయించింది.

ప్రత్యేక బడ్జెట్‌తో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు

రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. గాంధీ దవాఖానలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నొస్టిక్ లేబొరేటరీని ఏర్పాటుచేశారు. డయాగ్నొస్టిక్ కోసం ఎంఎస్‌ఐడీసీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా జరిగే డయాగ్నొస్టిక్ సర్వీసులను పర్యవేక్షిస్తున్నారు. రోగనిర్ధారణ కోసం ప్రజలు రూ.వేలల్లో ఖర్చు చేయకుండా ఉచితంగా ప్రభుత్వ దవాఖానల్లోనే పరీక్షలు చేయించుకునేలా ఏర్పాట్లుచేశారు.

ఆరోగ్యకరమైన సమాజానికి కేసీఆర్ కిట్లు

సర్కారు వైద్యశాలల్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పథకం అమలుచేస్తున్నది. సర్కారు దవాఖానల్లో సహజ ప్రసవాలు పెంచి.. సిజేరియన్లను, మాతాశిశు మరణాలను తగ్గించేందుకు 2017 జూన్ 3న ఈ పథకాన్ని తీసుకొచ్చింది. నాటినుంచి 2019 అక్టోబరు చివరినాటికి 3.40 లక్షల మందికి కేసీఆర్ కిట్లను అందజేసింది. బాలింతలు గర్భస్థ సమయంలో కోల్పోయిన జీవనభృతి ఇవ్వడం ద్వారా తగిన విశ్రాంతిని కల్పించేందుకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో కేసీఆర్ కిట్ల పథకం అమలుచేస్తున్నారు. ఇది కేవలం డబ్బులు పంచే కార్యక్రమంగా కాకుండా మహిళలకు సమాజంలో గౌరవం పెంచేలా, అన్ని దశల్లో గర్భిణులకు అండగా ఉండి ఆరోగ్యకరమైన సమాజం అందించేందుకు కృషిచేస్తున్నారు.

కోటిన్నర మందికి కంటి వెలుగు

అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాటినుంచి 2019 మార్చివరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి, 1,55,42,356 మందికి పరీక్షలు చేయడం విశేషం.

ఐసీయూ సేవలు

ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా ఎమర్జెన్సీ వ్యాధిగ్రస్థుల గురించి ప్రత్యేకమైన ఐసీయూ సేవలు అందుబాటులో లేవు. దీంతో పేదలు ఖరీదైన ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఐసీయూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికల్ కళాశాలల్లోనూ ఐసీయూలను ఏర్పాటుచేశారు.

అందుబాటులో డయాలసిస్ సెంటర్లు

కిడ్నీవ్యాధి బారినపడ్డవారు డయాలసిస్ సేవలు పొందేందుకు వ్యయ, ప్రయాసలకు లోనుకావాల్సి వచ్చేది. డయాలసిస్ కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ సేవలను అందించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 13 వేల మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మల్టీయూస్ డయాలసిస్ పద్ధతి కన్నా సింగిల్ యూస్డ్ డయాలసిస్ విధానంతో నాణ్యత, డయాలసిస్ ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లను పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకు ఎక్కువ ఖర్చవుతున్నప్పటికీ సింగిల్ యూస్ డయాలసిస్ విధానాన్ని దేశంలోనే మొదటగా మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. డయాలసిస్ కేంద్రాలను రాష్ట్రంలోని బోధన దవాఖానల ద్వారా నిర్వహిస్తున్నారు.

ఆరోగ్యశ్రీతో అండ

ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే శస్త్రచికిత్సల్లో పలు వ్యాధులను అదనంగా చేర్చారు. ట్రాన్స్‌ప్లాంటేషన్, సర్జరీలకు సంబంధించి కొత్త విధానాలను అమలుచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు 30 నుంచి 40 శాతానికి పెరిగాయి.

నగదురహితంగా ఈజేహెచ్‌ఎస్ సేవలు

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఎంప్లాయీస్, జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం(ఈజేహెచ్‌ఎస్)ను అమలుచేస్తున్నది. ఈజేహెచ్‌ఎస్ సేవలను వెల్‌నెస్ సెంటర్ల ద్వారా నగదురహిత వైద్యసేవలు అందిస్తున్నది. దీనికింద శస్త్రచికిత్సలు చేయడంతోపాటు, మందులనూ అందజేస్తున్నది.

మరణాలశాతం తగ్గుముఖం

రాష్ట్ర ప్రభుత్వం వివిధ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *