ఆదరించి… ఆశీర్వదించండి

పట్టభద్రుల సమస్యలపై పోరాడతా 

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్

నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ తీసిన గులాబీ శ్రేణులు 

పల్లాకు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు 

నల్గొండ, అక్షిత ప్రతినిధి : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సత్యవతీ రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి నామినేషన్ పత్రాల దాఖలుకు ఆఖరి రోజైన మంగళవారం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవం పాటిల్ కు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, సిట్టింగ్ శాసనమండలి సభ్యుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభధ్రులంతా తనకు తొలి ప్రాధాన్యం ఓటు నమోదు చేసి గెలిపించి ఆశీర్వదించాలని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్ధించారు. అంతకుముందు, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు క్లాక్ టవర్ సెంటర్ వద్దకు భారీగా తరలివచ్చారు. నల్లగొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు డాక్టర్ పల్లా రాజేశ్వర్ అభిమానులు, పార్టీ శ్రేణులు, మద్దుతుదారులు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో మంత్రులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి పాల్గొన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనూహ్య స్వాగతం లభించింది. అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించారు. నల్లగొండ పట్టణంలోని రోడ్లన్నీ టీఆర్ఎస్ జెండాలతో గులాబీమయం అయ్యాయి. కళాకారులు డప్పు చప్పుళ్ళతో నృత్యాలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.పార్టీ అభిమానులు బాణా సంచా పేల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. మహిళలు నిర్వహించిన కోలాటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దారిపొడవునా పలువురు మహిళలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మంగళ హారతి ఇచ్చి వీర తిలకం నుదుటదిద్దారు. తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కళాకారులను ప్రోత్సహించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, స్థానికులకు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో జిల్లా కలెక్టరేట్ కు తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, పలు నియోజకవర్గాల శాసనసభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *