ఆంధ్రభూమి ఉద్యోగులకు అండగా పోరు

ఛలో హైదరాబాద్ …విజయవంతం చేయండి

టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్, విరహత్ అలీ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తమ సంఘం మద్దతుతో ఈ నెల 8న ఆంధ్రభూమి ఎంప్లాయిస్ అసోసియేషన్ చేపట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జర్నలిస్టులు విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు పిలుపు నిచ్చారు. కరోనా సాకుతో ఏడాది కాలంగా ప్రచురణ నిలిపి వేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా పత్రికను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రభూమి యాజమాన్య అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. దక్కన్ క్రానికల్ ఉద్యోగులతో సమానంగా ఆంధ్రభూమి ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చట్టపరంగా దక్కాల్సిన అన్నీ ప్రయోజనాలను వర్తింపజేసి, పత్రికను వెంటనే పునరుధ్ధరించాలని శేఖర్, విరాహత్ డిమాండ్ చేశారు. పై డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆ పత్రికా యాజమాన్యానికి తమ సంఘం వినతిపత్రాన్ని సమర్పించినట్లు వారు స్పష్టం చేశారు. 8న, జరపతలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో ఐజేయూ, టీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే సంఘాల నాయకులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఆంధ్రభూమి ఉద్యోగులు పాల్గొంటున్నట్లు వారు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *