అసలైన సీఆర్పీఎఫ్ జవాన్లను తామెప్పుడూ గౌరవిస్తూనే ఉంటాo

కోల్‌కతా : రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలను తాము కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు సామాన్యులు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అసలైన సీఆర్పీఎఫ్ జవాన్లను తామెప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని, బీజేపీ సీఆర్పీఎఫ్ జవాన్లను మాత్రం తాము గౌరవించమని ఎద్దేవా చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లు మహిళలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆరాంబాగ్ నేత సుజాతా మండల్‌పై దాడి జరిగిందని, కర్రలతో కొట్టారని, అలాగే బూత్ అధ్యక్షుడి హత్య కూడా జరిగిందని, వీటన్నింటినీ తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. తాము మాత్రం అలాంటి పనులకు పాల్పడమని స్పష్టం చేశారు. ఒక్క ఓటుతోనే ప్రస్తుత పరిస్థితి మార్చవచ్చని దీదీ పిలుపునిచ్చారు. ‘‘ఈ సంఘటనలను వ్యతిరేకిస్తున్నాను. బుల్లెట్లతో మేం ప్రజలను చంపం. కర్రలను విసరము. కానీ… ఓటు మాత్రం చాలా విలువైనది. దీంతో సమాధానమిచ్చి తీరాలి.’’  అని మమత పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *