అక్షిత ప్రతినిధి: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌కి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగాను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విదేశాలలోను జరిగే పలు ఈవెంట్స్‌కి హాజరయ్యే రణ్వీర్ అక్కడ చేసే సందడికి ఫాలోవర్స్ అమితంగా పెరిగారు. అయితే లండన్‌లో కిరణ్ అనే ఓ యువతి రణ్‌వీర్‌కి పెద్ద అభిమాని కాగా, అక్కడ ఫ్యాన్ క్లబ్ కూడా మెయింటైన్ చేస్తుంది. లండన్ వెళ్లినప్పుడల్లా కిరణ్‌ని కలిసే రణ్వీర్ సింగ్ తన అభిమాని ప్రస్తుతం గర్భవతి అని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించాడు. దాదాపు గంటన్నర సేపు వారి ఇంట్లోనే ఉండి పలు విషయాలపై చర్చించారు. కిరణ్ భర్తతో పాటు ఆమె ఫ్యామిలీతో కూడా కొద్ది సేపు సరదాగా గడిపాడు రణ్వీర్. తన అభిమాన హీరో ఇంటికి రావడంతో ఫుల్ ఖుష్ అయిన కిరణ్..ఆయనతో దిగిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ప్రస్తుతం కపిల్ దేవ్ జీవిత నేపథ్యంలో 83 అనే సినిమా చేస్తున్నాడు ఈ బాలీవుడ్ హీరో. కొన్నాళ్లుగా ఈ చిత్రం కోసం లండన్‌లోనే ఉంటున్నాడు రణ్వీర్.
Tags: Ranveer singh; Ranveer Fan, Home visit