ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం వాయిదా

అక్షిత ప్రతినిధి, విశాఖ: విశాఖ- విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మరణంతో దీన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 26న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి ప్రారంభించాల్సి ఉంది. ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరనున్న ఈ రైలు ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుతుంది. వారంలో 5 రోజులు (గురువారం, ఆదివారం తప్ప) మాత్రమే నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్ల మాత్రమే ఆగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *