అపరిమిత కాల్స్‌ కోసం ఎయిర్‌టెల్‌ రూ.995 ఆఫర్‌

జియో రూ.999 ప్లాన్‌కు దీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్‌ రూ.995 రీఛార్జి ఆఫర్‌ను ప్రకటించింది. 180 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులు అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చు. రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తం ఆరు నెలల కాలంలో నెలకు 1జీబీ 3జీ/4జీ చొప్పున డేటా పొందవచ్చు. ఇదే తరహాలో ఎయిర్‌టెల్‌ గతంలో రూ.999 రీఛార్జి పథకాన్ని తీసుకొచ్చింది. 90 రోజుల కాలపరిమితతో కూడిన ఈ పథకంలో అపరిమిత కాల్స్‌, 60జీబీ వరకూ 3జీ/4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
జియో గతంలోనే రూ.999 రీఛార్జి పథకాన్ని ప్రకటించింది. అందులో 90 రోజుల వరకూ అపరిమితకాల్స్‌, 60జీబీ డేటా, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు వినియోగదారులు పొందవచ్చు. వీటితో పాటు అదనంగా జియో యాప్‌లను కూడా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ప్రకటించిన రూ.995 రీఛార్జి ఆఫర్‌లో డేటా తక్కువగా ఇచ్చినా, అపరిమిత కాల్స్‌ ఆరునెలల కాలపరిమితిలో ఉండటంతో వినియోగదారులను ఆకర్షించవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *