అన్నను నరికి చంపిన తమ్ముడు..!

అత్తాపూర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని పట్టపగలు నరికిచంపిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నడిగడ్డ తండాలో సొంత తమ్ముడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి తగాదా ఈ హత్యకు దారితీసినట్టు సమాచారం. ఇల్లు అమ్మిన డబ్బుల కోసం గత కొంతకాలంగా వీరిమధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున తమ్ముడు రవీందర్‌ తన స్నేహితుడు సాయితో కలిసి అన్న రాందాస్‌ను నరికి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *