అత్యాధునిక వసతులతో… వైష్ణవి గ్రాండ్

వైష్ణవి గ్రాండ్ హోటల్ ప్రారంభం 

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న

గుత్తా, భాస్కర్ రావు, భార్గవ్

 మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ లో వైష్ణవి గ్రాండ్ హోటల్, రెస్టారెంట్ ను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ శనివారం ప్రారంభించారు. రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లకు నాణ్యమైన, మెరుగైన సేవలందించాలని యాజమాన్యాన్ని కోరారు. వైష్ణవి హోటల్ లో పుట్టినరోజు వేడుకలను, పూర్వ విద్యార్థుల సమావేశాలను, ఇతర శుభకార్యాలను నిర్వహించుకునేందుకు సౌకర్యంగా కాన్ఫెరెన్సు హాల్ లో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, బీజేపీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ అభ్యర్థి కర్నాటి ప్రభాకర్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, టీఆర్ఎస్ నాయకులు యెడవల్లి శ్రీనివాస్ రెడ్డి, యూసుఫ్, హాతీరామ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *