అడిగిన తడవున… పరిష్కారం

దోబిఘాట్ సమస్యకు పరిష్కారం
కార్పొరేటర్ మందడి

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
కెపిహెచ్ బి 114 డివిజన్ పరిధిలో ఉన్న మూడవ ఫేస్ దోబీ ఘాట్ లో ఉన్న బోరు చెడిపోయి, నీళ్లు రాక, బట్టలు ఉతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని సంఘం కమిటీ సభ్యులు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని వెళ్లారు. కార్పొరేటర్ మందడి వెంటనే స్పందించి, స్వయంగా ధోబి ఘాట్ కు వచ్చి, ఆ సమస్యను ప్రత్యక్షంగా చూసి, సంబందిత అధికారులకు ఫోన్ చేసి, సమాచారాన్ని వారికి తెలియజేసి, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పారు. అనంతరం దోబీ ఘాట్ సభ్యులకు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తారని, వారికి హామీ ఇచ్చారు. ఇక మీదట మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు నిస్సందేహంగా వెంటనే తెలియజేస్తే సత్వర పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారు.ఈ కార్యక్రమములో స్థానిక నాయకులు కట్టా నరసింగరావు, కొండూరు నారాయణ రాజు, వార్డ్ మెంబర్ హనుమంతరావు, పిడికిటి గోపాల్ చౌదరి, రాము, భాస్కర్నాయి, వలవల నాయుడు, గఫుర్, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *