అక్షరాస్యత అభివృద్ధిలో గురువుదే కీలకపాత్ర : జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి

అక్షిత బ్యూరో, సూర్యాపేట : గుణాత్మక విద్యను అందించి అక్షరాస్యత శాతాన్ని పెంచే బాధ్యత ఉపాధ్యాయుల దేనని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకతనారాయన అన్నారు. ఆదివారం ప్రపంచ అక్షరాస్యత ది నోత్సవమును పురస్కరించుకొని జిల్లా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించి గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించి పేద విద్యార్థులకు క్రమశిక్షణ శాస్త్రీయ విజ్ఞానాన్ని బోధించి నమోదు శాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులను కోరారు .ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్త అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది ఉపాధ్యాయులను ముఖ్య అతిధుల చేతులమీదుగా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల శివకుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుండా రమేష్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు గోపాల్ రాజు బొల్లం సురేష్ బండారు రాజా నరేంద్రుని విద్యాసాగర్ రావు బోనగిరి విజయకుమార్ గుడిపాటి రమేష్ ,మిర్యాలకవిత ఈగ అనూష తాళ్లపల్లి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

tags : srpt, jc, sanjeevreddy, literacy day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *