గోవిందరావుపేట, అక్షిత ప్రతినిధి
రాత్రి కురిసిన అకాల వర్షం గాలి వానకు కోతకు వచ్చిన వరి పంట గింజలు రాలడం పంట నేల వాలడం తో రైతులు ఆగమాగం అయ్యారు. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి. విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాలు తెల్లవార్లు చీకట్లోనే గడిపాయి. బుధవారం ఉదయం వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని అమృతం కాకర్లపల్లి లక్ష్మీపురం మొద్దులగూడెం గ్రామాలలో నేల వాలి గింజలు రాలిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. మరో రెండు రోజులపాటు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో పంట నష్టాన్ని పరిశీలించనున్నట్లు వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ గాలి దుమారం వర్షాలు మరో రెండు రోజులపాటు ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలతో రైతులు ఆందోళన చేందుతున్నారు. చేతికంది వచ్చిన వరి పంట ఎక్కడ నేలపాలు అవుతుందన్న భయం రైతులను వెంటాడుతోంది. ఒకటి రెండు రోజుల్లో కోయవలసిన వరి పొలాలు వర్షం ధాటికి గాలి దాటికి గింజలు రాలి పోవడంతో రైతులు బోరుమంటున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.